కనులు కనులను దోచాయంటే? కాపాడేది కనుబొమ్మలే!
అందం అంటే అమ్మాయిలు.. ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా అమ్మాయిల చూపులలోనే ఉంటుందనేది కవుల వర్ణన.. నిజానికి అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.. అమ్మాయిల కళ్లు మాట్లాడతాయి.. నృత్యం చేస్తాయి.. గానం చేస్తాయి.. ఆ కళ్లలోనే సముద్రమంత లోతు భావాలు దాగివున్నాయి.. అంతటి అందమైన కళ్ళను మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి.. ఆ కనులు బ్యూటీఫుల్‌గా కనిపించాలంటే ఒత్తైన కనుబొమ్మలు ఉండాల్సిందే. మందంగా.. చూడ్డానికి ఒత్తుగా ఉండే కనుబొమ్మలు ( Eye Brows ) ముఖానికి మరింత వన్నె తీసుకొస్తాయి. అలాంటి ధృఢమైన కనుబొమ్మలు మీకు కావాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఒత్తైన కనుబొమ్మలు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే, అందరికీ అలా ఉండవు. చాలామందికి తక్కువ కనుబొమ్మలు ఉంటాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉన్నవారు చిన్నవారిగా కనిపిస్తారు. అయితే, అనేక కారణాల వల్ల చాలామందికి కనుబొమ్మలు అంత ఒత్తుగా, దృఢంగా పెరగవు. అలాంటి వారు కంగారు పడకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవచ్చు..
వాజలీన్ జెల్లీ..
కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి.. కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకి రెండు లేదా మూడుసార్లు వాజలీన్ జెల్లీని అప్లై చేయాలి. అయితే, కేవలం రాసి అలా ఉంచకుండా కాస్తా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఐబ్రోస్ రక్తప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి..
విటమిన్ ఇ ఆయిల్..
విటమిన్ ఇ ఆయిల్ కూడా కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడుతుంది. కాబట్టి రోజూ రాత్రి ఈ ఆయిల్‌ని అప్లై చేసి కాస్తా మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి.
మెంతిపిండిని కూడా వాడొచ్చు
మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది హెయిర్ ఫాలికల్స్‌ని పునర్నిర్మాణం చేయడంలోనూ సాయపడుతుంది. మెంతిపిండిని కొబ్బరినూనెతో కలిపి ఐబ్రోస్‌పై రాయండి. రాత్రంతా అలానే వదిలేసి మార్నింగ్ క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి.
ఆల్మండ్ ఆయిల్.. మరొక ఉపాయం
బాదం నూనెలో విటమిన్స్ ఉంటాయి. విటిమిన్ ఏ, బి, ఇ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడేవే. ఈ ఆయిల్‌ని కూడా కనుబొమ్మలపై మసాజ్ చేయడం వల్ల ఐబ్రోస్ బాగా పెరుగుతాయి.
ఉల్లిపాయ రసం..
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయడంటారు.. ఉల్లిపాయ రసం కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. దీని వల్ల హెయిర్ ఫోలిక్స్ బలపడి కొల్లాజెన్ కణజాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కారణంగా ఐబ్రోస్ కూడా బాగా పెరుగుతాయి. ఇలా కొన్నిరోజుల పాటు చేయడం వల్ల త్వరగా ఐబ్రోస్ పెరుగుతాయి.
ఆముదం.. కూడా ఒక ఉపాయమే
ఆముదంలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి కనుబొమ్మలను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్‌లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. రెగ్యులర్‌గా ఈ ఆయిల్‌ని అప్లై చేయడం వల్ల ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి.
కలబందని ఎలా వదిలేయగలం..
జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించే ఎన్నో అద్భుత గుణాలు అలొవెరా జెల్‌లోనూ ఉంటాయి. ఇది వెంట్రుకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ జెల్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయొచ్చు. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా పెరుగుతాయి.
ఆలివ్ ఆయిల్.. గుణాలకి లెక్కేలేదు
ఆలివ్ ఆయిల్‌లో అద్భుత పోషక గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మానికి కూడా ఎంతో పోషణనిస్తుంది. అలానే జుట్టు పెరుగదలకు కూడా ఉపయోగపడుతుంది.
పాలు.. చాలా తేలికైన అందుబాటులో ఉన్న పద్ధతి
పాలు మంచి మాయిశ్చరైజర్ కంటెంట్. ఇది జుట్టుపై సహజ కండీషనర్‌లా పనిచేస్తుంది. పడుకునేముందు పాలల్లో దూదిని ముంచి కనుబొమ్మలపై అప్లై చేయాలి. దీనిని రాత్రంతా అలా ఉంచినా సరే.. కడిగేసినా సరే.. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరిపాలు.. ఇవి కూడా త్వరగా లభిస్తాయి
ఐబ్రోస్‌పై కొబ్బరిపాలు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి.
గుడ్డు.. దీనికి తిరుగు లేదు
గుడ్డు పచ్చసొనలోని ప్రత్యేక గుణాలు కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా పెరిగేందుకు సాయపడతాయి. ఇది ఓ మంచి హోం రెమిడీ అని కూడా చెప్పొచ్చు. అయితే పచ్చసొని తీసుకుని కాస్తా అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పాలు, నిమ్మరసం మిశ్రమం
పాలల్లో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రాయడం వల్ల చక్కగా పెరుగుతాయి ఐబ్రోస్.
మందారం..
మందార పువ్వులోని ప్రత్యేక గుణాలు వెంట్రుకలని బాగా పెరిగేలా చేస్తాయి. మందార నూనెని లేదా మందార పువ్వుని పేస్ట్‌లా చేసి ఆరాక నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.
కాటుకతోనూ చక్కని ఐబ్రోస్..
కాటుక ఒక చక్కని సాంప్రదాయమైన పద్ధతి.. కాటుకని ఆలివ్ ఆయిల్‌ని కలిపి ఆ మిశ్రమాన్ని ఐబ్రోస్‌పై రాయాలి. ఇలా రెగ్యులర్‌గా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇలా రెగ్యులర్‌గా తరచూ ఏదో ఒకటి రాసి అప్లై చేయడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయి. అయితే కనుబొమ్మల విషయంలో చాలామంది అనేక తప్పులు చేస్తుంటారు. ఇది ఆ కనుబొమ్మల ఆకృతిపై పడుతుంది.
ఈ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో కొన్ని ..
నిజానికి ఐబ్రోస్ థ్రెడింగ్ ఎక్కువగా చేయడం వల్ల గ్రోత్ ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు.. అందులో ఎంతమాత్రం నిజంలేదు.. ఎక్కువగా థ్రెడింగ్ చేయించొద్దు.. ఎక్కువగా పెరిగినప్పుడు మాత్రమే అది కూడా ఆకారం కోసం మాత్రమే తీయించాలి.. అప్పుడే మంచి ఫలితాలు వస్తుంటాయి.
వీటితో పాటు చాలా మంది అనేక చోట్ల థ్రెడింగ్ ట్రై చేస్తుంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్స్.. రెగ్యులర్‌గా ఒకరిదగ్గరే చేయించుకోవడం చాలా ముఖ్యం. వారికే మన ఐబ్రోస్ షేప్ ఏంటో సరిగా తెలుస్తుంది..
మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచండి..