యువతులు మరియు మహిళల హెయిర్ కట్ ఎలా ఉండాలి?
హెయిర్ కట్ అనేది మగవారి జీవితంలో సర్వ సాధారణ విషయం.. అయితే యువతులు, మహిళల విషయంలో ఈ హెయిర్ కట్ చాలా ప్రత్యేకమైనది. యువతులు సరికొత్త రూపంలో కనిపించడానికి కొత్త రకం హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తారు.. యువకులు లేదా మగవారికి హెయిర్ కట్ సరిగా రాకపోతే వెంట్రుకలు తీసివేయించుకున్నా పెద్ద విషయం కాదు, నెలరోజుల్లో మళ్ళీ వారికి నచ్చిన హెయిర్ స్టైల్ కి వెళ్ళిపోవచ్చు, కానీ మహిళలు లేదా యువతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. హెయిర్ కట్ సరిగా లేకపోతే అందవికారంగా కనిపించవచ్చు, అందుకే ముఖం ఆకృతికి సరిపోయేలా క్రాఫ్ ఉండాలి. అప్పుడే చూడటానికి బాగా కనిపిస్తారు. సరైన హెయిర్ కట్ ముఖకవళికలను బయటకు వ్యక్తపరచడం పాటు స్టైల్‌ను కంప్లీట్ చేస్తుంది. అయితే ప్రతి ముఖ ఆకృతికి సొంత ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి అమ్మాయిలు ఫేస్ షేప్‌కు సరిపోయే హెయిర్ కట్ ఎంచుకోవాలి. అందుకు తగిన పార్లర్ ఎంపిక కూడా ముఖ్యమైనదే. అయితే ఏ ఫేస్ షేప్‌కి ఎలాంటి హెయిర్ స్టైల్ నప్పుతుందో తెలుసుకుందాం.
ఓవల్ ఫేస్ షేప్
ఓవల్ ముఖం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండే ముఖ ఆకృతి. అందుకే దీన్ని బెస్ట్ ఫేస్ షేప్ అంటారు. వీరికి చాలా రకాల హెయిర్ కట్స్ సరిపోతాయి. ముఖ్యంగా పొరలుగా ఉండే హెయిర్ కట్ జుట్టుకు కదలికను జోడిస్తుంది. దీన్ని చాలా విధాలుగా స్టైల్ చేయవచ్చు. బాబ్ హెయిర్‌స్టైల్ చాలా క్లాసిక్, స్లీక్ హెయిర్ కట్. జుట్టు పొడవు ఎంతైనా బాబ్ హెయిర్ కట్ బాగా సరిపోతుంది. వీరికి పిక్సీ కట్ చాలా బోల్డ్ హెయిర్ కట్. ఫేసియల్ ఫీచర్స్‌ను బాగా హైలైట్ చేస్తుంది.
గుండ్రని ముఖం
గుండ్రని ముఖం అంటే మృదువైన కోణాలు, పెద్ద బుగ్గలు ఉంటాయి. ఈ ముఖం పొడవుగా కనిపించేలా, కోణాలు స్పష్టంగా కనిపించేలా హెయిర్ కట్ ఎంచుకోవాలి. వీరికి అసిమెట్రిక్ పిక్సీ హెయిర్ కట్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పొడవైన, లేయర్డ్ కట్ కట్ ముఖాన్ని పొడవుగా చూపిస్తుంది, చెంప ఎముకలను హైలైట్ చేస్తుంది. సైడ్-స్వీప్ట్ బ్యాంగ్ హెయిర్ కట్ ముఖాన్ని ఒక వైపుకు లాగుతుంది, స్లిమ్‌గా కనిపించేలా చేస్తుంది.
హార్ట్ షేప్డ్ ఫేస్
హార్ట్ షేప్డ్ ఫేస్ అంటే నుదురు వెడల్పుగా ఉండి, గడ్డం చిన్నగా ఉంటుంది. ఈ ముఖం కింది భాగం చిన్నగా కనిపించేలా హెయిర్ కట్ ఎంచుకోవాలి. వీరికి షోల్డర్ లెంగ్త్ వేవ్ కట్ నుదురును మృదువుగా చూపిస్తుంది, గడ్డం చుట్టూ వాల్యూమ్‌ను జోడిస్తుంది. లేయర్డ్ బాబ్ హెయిర్ కట్ ముఖాన్ని చక్కగా ఫ్రేమ్ చేస్తుంది. సైడ్-స్వీప్ట్ బ్యాంగ్ స్టైల్ నుదిటి వెడల్పును తగ్గిస్తుంది, కళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది.
డైమండ్ ఫేస్ షేప్
వీరికి చెంప ఎముకలు బయటకు ఉండి, నుదురు, గడ్డం చిన్నగా ఉంటాయి. ఈ ముఖానికి మృదుత్వం, వాల్యూమ్‌ను జోడించే హెయిర్ కట్ ఎంచుకోవాలి. వీరికి సాఫ్ట్, సైడ్-పార్టెడ్ బాబ్ హెయిర్ కట్ ముఖం కోణాలను సున్నితంగా మార్చేస్తుంది. వాల్యూమ్‌తో పిక్సీ కట్స్ ముఖానికి ఎత్తును జోడిస్తుంది, చిన్న గడ్డాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. విస్పీ ఫ్రింజ్ హెయిర్ కట్ నుదురును మృదువుగా చూపిస్తుంది, కళ్లను హైలైట్ చేస్తుంది.
చతురస్రాకార ముఖాలు బలమైన దవడ, విశాలమైన నుదుటితో ఉంటాయి. ఈ లక్షణాలను మరింత అందంగా చూపించే హెయిర్ కట్ సెలెక్ట్ చేసుకోవాలి. వీరికి లాంగ్ లేయర్స్ కర్ల్ అందాన్ని పెంచేస్తుంది. షాగ్ హెయిర్ కట్ మంచి ఆకృతిని సృష్టిస్తుంది, చదరపు ఆకారాన్ని చక్కగా మారుస్తుంది. సాఫ్టీ, వేవీ స్టైల్స్ ముఖ సౌందర్యాన్ని మరింత పెంచేస్తాయి.
మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచండి..