ఇంట్లోనే పెడిక్యూర్ .. చేయండి పాదాలతో ప్యార్
పాదాలను కాపాడుకోవడం అంటే మొత్తం శరీరాన్ని కాపాడుకోవడం.. పాదాలు పగుళ్లు కేవలం అందవిహీనంగా కనపడడం మాత్రమే కాదు.. అనారోగ్యానికి సంకేతం కూడా.. ఆ పగుళ్ళ ద్వారానే ఎన్నో రకాల క్రిములు మన శరీరంపైన దాడి చేస్తాయి.. దీని అర్థం మనం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఫాలో అవ్వడం లేదని పాదాల పగుళ్ల చెబుతాయి. అందుకే చర్మ రక్షణ కోసమే కాక పాదాల సంరక్షణ కోసం సరిపడా సమయం కేటాయించడం అవసరం..
పాదాలు పగుళ్లు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక ప్రధానమైన సమస్య. ఈ సమస్యతో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ మంది చర్మ ఆరోగ్యాన్ని చూసుకుంటారు. కానీ, పాదాలను పట్టించుకోరు. అందులో ఏర్పడే పగుళ్లు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌గా మారి మరో రకమైన వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కాలంతో సంబంధం లేకుండా పాదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన కారణం అంటూ లేదు, చాలా కారణాలు ఉన్నాయి. వేడి నీరు, అధిక స్క్రబ్, డ్రై స్కిన్, ఎక్కువగా నడవడం, చెప్పులు లేకుండా నడవడం, పరుగెత్తడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పరిశుభ్రత పాటించకపోవడం వంటివి పాదాలు పగలటానికి ప్రధాన కారణమవుతాయి.
అయితే ఇక్కడ ముఖ్య సమస్య ఏమిటంటే ఈ పగిలిన పాదాలను ఎక్కువకాలం పట్టించుకోకపోతే, త్వరగా నయం చేసుకోకపోతే.. ఇతర సమస్యలకు కారణమవుతాయి. పాదాలు పగుళ్లు లేకుండా మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం మార్కెట్ లో లభించే ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల పాదాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే పగిలిన పాదాలకు రసాయన ఉత్పత్తుల కన్నా మన ఇంటిలో లభించే కొన్ని పదార్ధాలను ఉపయోగించి అద్భుతమైన పెడిక్యూర్ ను ఇంట్లోనే చేసుకోవచ్చు. దీంతో అందమైన, మృదువైన పాదాలను పొందవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం వాతావరణ మార్పులు, వేడి నీళ్ల స్నానం, ఎక్కువసేపు వేడి నీటిలో పాదాలు ఉంచడం, ఎక్కువ స్క్రబ్, చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా ఎక్కువ పగుళ్లు ఏర్పడతాయి.. వారు సూచించిన ప్రాథమిక విషయం ఏంటంటే, పాదాలు పొడిగా ఉంటే పగిలే అవకాశం ఎక్కువగా ఉందని అందుకే ఎక్కువగా నీరు తాగాలని దాని వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుందని సూచిస్తున్నారు. కాబట్టి నీరు ఎక్కువ తాగడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి.
మన దేశ వాతావరణం ప్రకారం చాలా మంది పాదాలు పొడిగా ఉంటాయి.. ఒక నిపుణుల సర్వే మేరకు, మన దేశంలో స్నానం చేసిన తరువాత ముఖం, చేతులు తేమగా ఉండటానికి మొయిశ్చరైజర్ ఉపయోగిస్తున్నారు. కానీ పాదాలకు మొయిశ్చరైజర్ వాడటం లేదు. దీని వల్ల పాదాలు పొడి బారే అవకాశం ఉంది. అయితే నిపుణుల సూచన ఏమిటంటే పాదాల కోసం డబ్బులు ఖర్చుపెట్టి మాయిశ్చరైజర్ వాడవలసిన అవసరంలేదు.. అందుకు ఒక మార్గం ఉంది.. అది ఏంటంటే స్నానం చేసిన తర్వాత పాదాలు తేమగా ఉండటానికి వాజిలిన్, కొబ్బరి నూనె రాస్తే సరిపోతుంది..
అలాగే పాదాలను తేమగా ఉంచడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏ కాలంలోనైనా లభించే ఔషధం అరటిపండు. అరటిపండు మీ పాదాలను తేమగా ఉంచడానికి సాయపడుతుంది.. అది ఎలాగో తెలుసుకుందాం!!
అరటిపండుతో అందమైన పాదాలు..
ఒక అరటిపండు గుజ్జు తీసుకొని దాన్ని పేస్ట్‌లా చేసి మీ పాదాలకు రాయండి. ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల వరకు ఉంచి, తరువాత నీటితో మీ పాదాలను శుభ్రం చేసుకోవాలి. అరటిపండు రాయడం వల్ల పాదాలు తేమగా మారతాయి. దీని వల్ల పాదాలు పగిలే అవకాశాలు తక్కువ.
అంతర్జాతీయ మేకప్ నిపుణుడు, ఎల్‌పిఎస్ బ్యూటీ క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషికా తనేజా పాదాలకు నిమ్మకాయకు అద్భుతంగా పని చేస్తుంది. పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే పాదాలకు చెప్పులు లేకుండా నడిచేటప్పుడు నేలపై ఉండే క్రిములు పాదాలకు ఉండిపోతాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పాదాలను ఎప్పటికప్పుడు స్క్రబ్ చేయడం వల్ల పాదాలపై ఉండే మృత చర్మం తొలగిపోతాయి. అయితే ఇందుకోసం మీరు చేయాల్సిందల్ల క్రమం తప్పకుండా ఇంట్లోనే పెడి క్యూర్ చేసుకోవడం. దీని కోసం మీకు కావాల్సిందల్లా నిమ్మకాయి, గ్లిజరిన్, జొజోబా ఆయిల్.
గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొన్ని చుక్కల జోజోబా నూనెను వేసి మీ పాదాలను కొంత సేపు నీటిలో ఉంచండి . తరువాత తేలికపాటి స్క్రబ్ తో పాదాలను స్క్రబ్ చేయండి. దీని వల్ల మీ పాదాలపై ఉండే మృత చర్మాన్ని తేలికగా స్క్రబ్ చేయవచ్చు. నిమ్మకాయ కొద్దిగా ఆమ్లంగా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మీ పాదాలను గ్లిజరిన్ తో మృదువుగా మసాజ్ చేసి సాక్స్ ను ధరించండి.
పాదాలకి మాస్క్..
ఈ మాస్క్ తయారీ కోసం రసాయన పదార్ధాలు, ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. వంటగది పదార్థాలను ఉపయోగించి సులువుగా పాదాలకు మాస్క్ ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం "రెండు టేబుల్ స్పూన్ల అవోకాడో పేస్ట్ ను అర కప్పు మయోనైస్, రెండు టేబుల్ స్పూన్ల వోట్‌మీల్ ను బాగా కలపండి . ఈ పేస్ట్‌ని పాదాలకు రాసి అరగంట వరకు ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసి , పాదాలను ఆరనివ్వండి.. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మీ పాదాల పగుళ్ళు తగ్గి మృదువుగా మారతాయి.. ఎక్కువ మంది సమయాభావం కారణంగా పాదాలపై శ్రద్ధ చూపడం లేదు.. అటువంటి వారు పార్లర్ ని సంప్రదించి పెడిక్యూర్ చేయించుకోవచ్చు..
మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచండి..