డైట్ కారణంగా జుట్టు రాలుతోందా? నిజమేనా?
నిజానికి ఈ కాలంలో జుట్టు రాలడానికి కారణాలు లెక్క పెట్టలేనన్ని.. కాలుష్యం, పని ఒత్తిడి, పోషణ లేకపోవడం, రకరకాల నీరు సేవించడం, ఆహారపు అలవాట్లు, జన్యులోపాలు ఇలా ఎన్నో కారణాలతో చిన్న తనంలోనే బట్టతల వచ్చేస్తుంది.. అందువలన నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ఎక్కువగా పోషకాహారం తీసుకోకపోవడం ముఖ్య కారణం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీ డైట్‌లో కేలరీలని తగ్గించడం లేదా బరువు పెరగడానికి ఎక్కువగా తినడం వల్ల జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అందవు. ఈ కారణాల వలన హెయిర్ ఫోలికల్స్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి. దీంతో జుట్టు రాలుతుంది. కాబట్టి, బాడీలోని పోషకాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి.. డైట్ లో అన్ని పోషకాలు బ్యాలెన్స్ చేస్తే జుట్టు సమస్య తీరిపోతుంది.. ఏ పోషకాలు ఎక్కువగా అవసరమో తెలుసుకుందామా?
ప్రోటీన్..
జుట్టు రాలడాన్ని తగ్గించి పొడుగ్గా పెంచడంలో ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. అందుకోసం జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేసే విధంగా, తగినంత ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం. ఇది తగ్గినప్పుడు పెరుగుదల తగ్గుతుంది. దీనికోసం గుడ్లు, మీట్, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినండి.
ఖనిజాలు..
ఐరన్, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా జుట్టుని పెంచుతాయి. ఐరన్ లోపం కారణంగా హెయిర్ ఫోలికల్స్‌కి అవసరమైన పోషకాలు అందవు. దీంతో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. వీటితో పాటు జింక్, సెలీనియం జుట్టుని పెరిగేలా చేస్తాయి. జింక్ లోపం దీర్ఘకాలికంగా జుట్టుని రాలేలా చేస్తుంది. ఈ లోపం లేకుండా ఉండాలంటే ఈ ఖనిజాలన్నీ దొరికే పప్పులు, బచ్చలికూర, బ్రకోలీ, సీతాఫలం వంటివాటిని తీసుకోండి.
విటమిన్స్..
విటమిన్స్ లోపం కారణంగా కూడా జుట్టు పెరగదు. అవేంటంటే..
విటమిన్ ఎ.. మీరు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ విటమిన్ ఎ తీసుకున్నా మీ బాడీ దానిని అబ్జార్బ్ చేసుకోదు. కాబట్టి, తినే మోతాదులోనే తీసుకోవాలి.
విటమిన్ బి 7, లేదా బయోటిన్, మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. తగినంత బయోటిన్ లేకపోతే జుట్టు పెళుసుగా మారి రాలుతుంది.
విటమిన్ సి.. మీ బాడీని ఐరన్ గ్రహించడంలో సాయపడుతుంది. ఇది తగ్గడం వల్ల జుట్టు డెన్సిటీ తగ్గుతుంది.
విటమిన్ డి లేకపోవడం వల్ల వెంట్రుకలు, కుదుళ్ళు బలహీనమై జుట్టు రాలుతుంది. కాబట్టి, తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.
వీటితో పాటు..
పైన చెప్పుకున్న విటమిన్స్, మినరల్స్‌తో పాటు పోషకాహార లోపాలు కూడా ఉంటాయి. అవి..
విటమిన్ బి12, కాపర్, రిబోఫ్లేవిన్, బయోటిన్, ఫోలేట్..
నిజానికి మీరు సమస్యని గుర్తించిన వెంటనే డాక్టర్‌ని కలవడం ఉత్తమమైన మార్గం. వారు మీ శరీర తత్వానికి తగిన డైట్ సజెస్ట్ చేస్తారు. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు.
గమనిక :
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచండి..