కళ్ళు కబుర్లు చెప్తే.. పెదాలు పదనిసలు నేర్పుతాయి!!
అందమైన అమ్మాయి ముఖంలో ఎవరినైనా మొదట ఆకర్షించేది ఆమె కళ్ళు.. ఆ తరువాత మృదువైన పెదాలు అనేది జగమెరిగిన సత్యం..!! నిజానికి అమ్మాయిలు తమ పెదాలను ఎంతో అపురూపంగా చూసుకుంటారు.. అయితే మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు పెదాలు పొడిబారి పోయి, మృదుత్వాన్ని కోల్పోయి, నల్లగా మారతాయి.. ఆ పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా పరిణమిస్తుంది..
పెదవులు చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటాయి.. మరియు మన శరీరంలో అత్యంత ఆకర్షణ కలిగిన భాగాలలో ఒకటి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వాటిని అందంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి క్రీములు, లోషన్ లు వాడవచ్చు.. కానీ ఇది ఖర్చుతో కూడిన పని.. అయితే మన ఇంటిలో దొరికే కొన్ని పదార్ధాలతో పెదాలను అందంగా తయారు చేసుకోవచ్చు.. క్రీములు, లోషన్ ల కోసం ఖర్చు చేసే డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు? పెదాలను మృదువుగా మార్చడానికి కొన్ని చిట్కాలు మీ కోసం...
మొదటిగా జాగ్రత్తలు :
1. మీ చేతి వేళ్ళతో పెదాలపై రుద్దడం మానేయండి.
2. మీ పళ్ళతో వాటిని కొరకకుండా జాగ్రత్త పడండి.
3. అవసరమైన మేరకే లిప్ స్టిక్ ఉపయోగించండి.
4. మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడకండి.
5. పగటి పూట క్రీములు ఎక్కువగా వాడకండి.. నిద్రపోయే సమయంలో మాత్రమే ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
6. సూర్యకిరణాలు నుండి రక్షించుకోండి.
7. లిప్ స్టిక్ అప్లై చేస్తే లిప్ బామ్ రాయడం మరచిపోకండి.
8. పడుకునే ముందు లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్ లేకుండా చూసుకోండి.
9. లిప్ స్టిక్ తొలగించడానికి తడి కాటన్ బాల్ తో మెత్తగా తుడవండి. గట్టిగా రుద్దకండి.
10. చివరగా అన్నిటికంటే ముఖ్యమైనది.. మీ లిప్ కాస్మోటిక్స్ లేదా బామ్ ను ఇతరుతో ఎపుడూ షేర్ చేయకండి.
పెదాలను మృదువుగా చేయడానికి చిట్కాలు :
1. ఒక స్పూన్ బాదాం నూనెలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పెదవులపై మృదువుగా రుద్దాలి.
2. ఆలివ్ నూనెలో కొద్దిగా పంచదార కలిపి పెదాలపై సున్నితంగా మర్దన చేయాలి.
3. నిద్రపోవడానికి ముందు లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్ తొలగించండి.. ఇందుకోసం బాదాం లేదా ఆలివ్ ఆయిల్ వాడవచ్చు.
4. దానిమ్మ గింజలను మెత్తగా నూరి.. మీగడ కలిపి రాస్తే నల్లదనం పోతుంది.
5. కీరదోస రసాన్ని పెదాలకు పట్టించాలి.. ఇలా చేస్తే సహజ కాంతి బయటకు వస్తుంది.
6. రాత్రి పూట పెదాలకు పాల మీగడ పట్టించి కడగకుండా వదిలేయండి.. ఇలా చేస్తే పెదాలలో తేమ తగ్గదు.
7. గుప్పెడు గులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలకు రాస్తే పెదాలు పగలవు.
8. వారానికి ఒకసారి బ్రష్ తో పెదాలపై రుద్దడం వలన డెడ్ సెల్స్ తొలిగిపోతాయి.
9. కలబంద సహజ మాయిశ్చరైజర్.. కలబంద గుజ్జును పాలలో కలిపి పెదాలపై రాసుకోవాలి.
10. టమాటోని గుండ్రంగా కట్ చేసి దానిపై తేనె వేసి పెదాలపై రుద్దాలి.
ఇవి తూచా తప్పకుండా పాటిస్తే ఏ కాస్మోటిక్స్ వాడవలసిన అవసరం ఉండదు.
మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచండి..