కళ్ళు అందంగా.. ఆరోగ్యంగా ఉండటం కోసం..!!

అమ్మాయిల కళ్ల గురించి ప్రస్తావన లేకుండా ఏ కవి కూడా తన కవిత్వాన్ని పూర్తి చేయలేడు.. ఎందుకంటే అందం గురించి వర్ణిస్తూ కళ్ల ప్రస్తావన లేదంటే ఆ కవితకి జీవం లేనట్టే !! 
అందమైన కళ్ళు ఉండటం ఒక వరం.. కానీ అది మన చేతులలో లేదు.. అయితే కళ్ళను అందంగా తీర్చి దిద్దుకోవడం ఆరోగ్యవంతంగా ఉంచుకొని సంరక్షించుకోవడం మాత్రం మన చేతులలోనే ఉంది.. పెద్దవాళ్ళు ఏదైనా వస్తువు గురించి లేదా ఒక మనిషి గురించి జాగ్రత్తలు చెప్పే సమయంలో కంటికి రెప్పలా కాపాడుకోమంటారు.. మరి అలాంటప్పుడు కంటిరెప్పలను ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి... మీ కళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అది కూడా మన ఇంటిలోనే..
కళ్ళు అందంగా.. ఆరోగ్యంగా ఉండటం కోసం మన ఇంట్లోనే తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటించవలసిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


Pearls Beauty Parlour


కళ్ళు అందంగా.. ఆకర్షణీయంగా ఉండాలంటే :

1. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అన్నాడొక కవి.. కానీ మిత నిద్రాలోలుడు రోగాల ప్రీతిపాత్రుడు.. అంటాడు మరొక కవి.. ఈ రెండిటి అర్థం ఒకటే.. అతి నిద్రా మంచిది కాదు.. మిత నిద్రా మంచిది కాదు.. పెందలకడనే పడుకొని పెందలకడనే నిద్ర లేచేవాడే ఆరోగ్యవంతుడు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఎటువంటి నిద్రాభంగాలు లేని ప్రశాంతమైన నిద్ర కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం మాత్రమే కాదు.. మొత్తం శరీరాన్ని నూతన ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది.. 
నిద్రపోయే ముందు కళ్ళను మంచి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి.. అపుడు కళ్ళపైన ఒత్తిడి తగ్గుతుంది.
మీరు పడుకునే ముందు రేపటి గురించి ఆలోచించకండి..
ఒక టీస్పూన్ టమాటా గుజ్జును, అర టీ స్పూన్ నిమ్మరసాన్ని చిటికెడు పసుపును, ఒక టీస్పూన్ శనగపిండిని తీసుకొని దీనిని ఒక మెత్తని మిశ్రమంగా కలుపుకొని కళ్ళ రెప్పలపై రాసుకుని ఓ పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై నీళ్ళతో శుభ్రంగా కళ్ళను కడుక్కోవాలి. ఇలా చేస్తే కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయని చెబుతున్నారు.

కళ్ళ ఆరోగ్యం కోసం ఈ పని చెయ్యండి :

1. కళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అర టీ స్పూన్ కీర రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే, కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. 
కీరదోస ముక్కలను కట్ చేసి కళ్లమీద పెట్టుకుని కళ్ళు రిలాక్స్డ్ గా ఉండి అందంగా కనిపిస్తాయి. 
చాలా మందికి కంటికింద నల్లటి చారలు వస్తాయి. ఈ చారలు తగ్గడానికి కూడా మనం ఇంట్లోనే చేసుకునే అనేక రెమిడీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 
ఇక కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోవడం కోసం పాలమీగడతో ముడతలు ఉన్నచోట మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
కళ్ళ క్రింద నల్లని వలయాలు తగ్గాలంటే ఈ పని చెయ్యండి. 
కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గాలంటే విటమిన్ ఈ నూనెతో కళ్ళ కింద మసాజ్ చేయాలి. అంతేకాదు ఆలివ్ నూనె, పసుపు పొడి కలిపి ముద్దగా చేసుకుని కళ్ళ కింద నల్లటి వలయాలపై రోజు రాసుకోవాలి. అలా చేస్తే కళ్ల కింద వలయాలు తొందరగా తగ్గిపోతాయి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఉంటే ఎక్కువ మంచినీళ్ళు తాగటం కూడా డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయని అంటున్నారు. కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి అవి చాలా అసహ్యంగా కనిపిస్తుంటే, డార్క్ సర్కిల్స్ నివారణకు టీ బ్యాగ్ తెరఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
దీనికోసం చేయవలసిందల్లా టీ తయారు చేసుకున్న తర్వాత, ఆ పొడిని ఓ బ్యాగ్ లో వేసి టీ బ్యాగ్ ను ఫ్రిజ్లో ఉంచి కూల్ చేయాలి. ఆ తరువాత టీ బ్యాగ్ ను కళ్ళ పైన, కంటిచుట్టూ పెట్టుకోవాలి. టీలో ఉండే కెఫిన్ రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఈ సమస్య తొలగిపోతుంది. అయితే క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు చేస్తే మెరుగైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.